Silver Price Today: వెండి@ 2.06 లక్షలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 06:33 AM
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రేసు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.7,300 పెరిగి...
ఒక్క రోజే కిలో రూ.7,300 పెరుగుదల
న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రేసు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.7,300 పెరిగి రూ.2,05,800కు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఔన్స్ (31.10 గ్రాములు) వెండి ధర 66.52 డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. మేలిమి బంగారం సైతం ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.1,36,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నూ 24 కేరట్ల ఔన్స్ పసిడి ధర 4,335 డాలర్లకు చేరింది. దేశీయ మార్కెట్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు కిలో వెండి మదుపరులకు రూ.1,18,533 లాభం (135.34ు) పంచినట్టయింది.
ఇవీ చదవండి:
జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి
యశోద హాస్పిటల్స్, ఆర్‌ఎస్ బ్రదర్స్ పబ్లిక్ ఇష్యూలకు సెబీ ఓకే