Share News

Robert Kiyosaki Prediction: వచ్చే ఏడాది చివరికి వెండి 6 లక్షలు

ABN , Publish Date - Nov 26 , 2025 | 02:14 AM

ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో కనీవిని ఎరుగని మహా పతనం ఇప్పటికే ప్రారంభమైందని ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటైన ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత, అమెరికన్‌ బిజినె్‌సమెన్‌ రాబర్ట్‌ కియోసాకి...

Robert Kiyosaki Prediction: వచ్చే ఏడాది చివరికి వెండి 6 లక్షలు

  • స్టాక్‌ మార్కెట్లలో మహాపతనానికి బీజాలు

  • బులియన్‌, క్రిప్టోలతోనే పెట్టుబడులు సేఫ్‌

  • రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత అంచనా

న్యూఢిల్లీ: ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో కనీవిని ఎరుగని మహా పతనం ఇప్పటికే ప్రారంభమైందని ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటైన ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత, అమెరికన్‌ బిజినె్‌సమెన్‌ రాబర్ట్‌ కియోసాకి ఇన్వెస్టర్లను హెచ్చరించారు. అమెరికా మార్కెట్లో మొదలైన ఈ పతనం క్రమంగా యూరప్‌, ఆసియా మార్కెట్లకు వ్యాపించనుందని అన్నారు. పెట్టుబడులను రక్షించుకునేందుకు ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన సూచించారు. ఈ కష్టకాలంలో బంగారం, వెండితోపాటు బిట్‌కాయిన్‌, ఎథిరియం వంటి క్రిప్టోకరెన్సీలే పెట్టుబడుల విలువను పెంచగలవని ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు.

రియల్టీ మార్కెట్టూ క్రాష్‌.. : కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీల షేర్లలో ఏర్పడిన భారీ బుడగ ఎప్పుడైనా పేలవచ్చన్న ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే ఒత్తిడికి లోనవుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. ఇందుకు తోడు ఏఐ టెక్నాలజీ దెబ్బకు ఉద్యోగాల ఊచకోత కూడా ఇప్పటికే మొదలైందని, రాబోయే సంవత్సరాల్లో ఇది తారాస్థాయికి చేరుకోనుందని ఇప్పటికే పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. లక్షల్లో ఉద్యోగాలు హరించుకుపోతే.. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కూడా కుప్పకూలుతుందని అభిప్రాయపడ్డారు.


అంతర్జాతీయ మార్కెట్లో 200 డాలర్లకు వెండి..: ఆర్థిక సంక్షోభ సమయాల్లో భద్రమైన పెట్టుబడి సాధనాలుగా పేరున్న బంగారం, వెండి ధరలు మున్ముందు భారీగా పెరగనున్నాయని కియోసాకి అంటున్నారు. ప్రస్తుతం 50 డాలర్ల స్థాయిలో ఉన్న ఔన్స్‌ సిల్వర్‌.. త్వరలోనే 70 డాలర్లకు ఎగబాకవచ్చని.. వచ్చే ఏడాది చివరినాటికి 200 డాలర్లకు చేరుకోవచ్చని కియోసాకి అంచనా వేశారు. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.1.55 లక్షలు పలుకుతోంది. కియోసాకి అంచనాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ వెండి 200 డాలర్లకు పెరిగితే.. దేశీయంగా కిలో వెండి రూ.6.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!

మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌‌మెంట్‌పై అవగాహన కల్పించండి!

Updated Date - Nov 26 , 2025 | 02:14 AM