Silver Hits New Record in Hyderabad: హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2.05 లక్షలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:50 AM
బులియన్ మార్కెట్‌లో రికార్డుల హోరు కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం వెండి ధర కాస్తంత దిగజారినప్పటికీ హైదరాబాద్...
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్‌లో రికార్డుల హోరు కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం వెండి ధర కాస్తంత దిగజారినప్పటికీ హైదరాబాద్, విశాఖపట్టణం నగరాల్లో మాత్రం కిలో వెండి రూ.2 లక్షలు దాటింది. హైదరాబాద్‌లో బుధవారం కిలో వెండి ధర ఏకంగా రూ.7,000 పెరిగి రూ.2.05 లక్షలకు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. వైజాగ్‌లోనూ రూ.1,000 లాభంతో రూ.2,07 లక్షల వద్ద ట్రేడైంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రికార్డు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర బుఽధవారం 4,200 డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. పసిడి ధర ఇలా పెరగడం వరుసగా ఇది మూడో రోజు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News