Shanta Biotechs: శాన్‌కోల్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:03 AM
శాంతా బయోటెక్నిక్స్ అభివృద్ధి చేసిన నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ శాన్‌కోల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రీ క్వాలిఫికేషన్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): శాంతా బయోటెక్నిక్స్ అభివృద్ధి చేసిన నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ శాన్‌కోల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రీ క్వాలిఫికేషన్ లభించింది. దీంతో కలరా ప్రబలంగా ఉన్న దేశాల్లో వినియోగించేందుకు యునిసెఫ్, గావీ, పాహో వంటి ప్రపంచ ప్రొక్యూర్మెంట్ సంస్థలు శాంతా బయో నుంచి శాన్‌కోల్ కొనుగోలు చేసేందుకు మార్గం సుగమం అయింది. ‘‘కలరా వ్యాధి తరచుగా వ్యాపించే దేశాలకు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండే ఔషధంగా శాన్‌కోల్‌ను అభివృద్ధి చేశాం. డబ్ల్యూహెచ్‌ఓ అనుమతితో మా ప్రధాన లక్ష్యం నెరవేరింది’’ అని కంపెనీ వ్యవస్థాపకుడు కేఐ వరప్రసాద్ రెడ్డి అన్నారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి