Shampri Nutritions: బాండ్ల ద్వారా రూ 355 కోట్లు శాంప్రి న్యూట్రిషన్స్
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:03 AM
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే శాంప్రి న్యూటిషన్స్ కంపెనీ ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ (ఎఫ్‌సీసీబీ) ద్వారా నాలుగు కోట్ల డాలర్లు...
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే శాంప్రి న్యూటిషన్స్ కంపెనీ ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ (ఎఫ్‌సీసీబీ) ద్వారా నాలుగు కోట్ల డాలర్లు (సుమారు రూ.355.06 కోట్లు) సమీకరించనుంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఒక్కోటి లక్ష డాలర్ల ముఖ విలువ ఉండే 400 ఎఫ్‌సీసీబీలను జారీ చేయనుంది. ఈ నిధులను ఈజిప్టు, లైబీరియాతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విస్తరణ కోసం వినియోగించనున్నట్టు కంపెనీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ