Share News

700 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:32 AM

పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లబడిన నేపథ్యంలో ఏర్పడిన సానుకూలతల నడుమ మార్కెట్‌లో కొనుగోళ్ల మద్దతు పెరిగింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజ...

700 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లబడిన నేపథ్యంలో ఏర్పడిన సానుకూలతల నడుమ మార్కెట్‌లో కొనుగోళ్ల మద్దతు పెరిగింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఈక్విటీ మార్కెట్‌ సూచీలు ఒక శాతం మేరకు దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ 700.40 పాయింట్ల లాభంతో 82,755.51 వద్ద ముగియగా నిఫ్టీ 200.40 పాయింట్ల లాభంతో 25,244.75 వద్ద క్లోజయింది. మార్కెట్‌ లాభాల్లో ముగియడం వరుసగా ఇది రెండో రోజు. ఎక్స్ఛేంజిల వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం రూ.5,266.01 కోట్ల విలువ గల షేర్లు విక్రయించగా దేశీయ సంస్థలు రూ.5,209.60 కోట్ల విలువ గల షేర్లు కొనుగోలు చేశాయి

ఎస్‌బీఐ నుంచి రూ.25,000 కోట్ల క్యూఐపీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరులో రూ.25,000 కోట్ల మొత్తాన్ని క్యూఐపీ ద్వారా సమీకరించనుంది. 2017లో జారీ చేసిన రూ.15,000 కోట్ల క్యూఐపీ తర్వాత ఎస్‌బీఐ ఇంత పెద్ద క్యూఐపీ జారీ చేయడం ఇదే మొదటిసారి.

యూనియన్‌ బ్యాంక్‌ రూ.6 వేల కోట్ల సమీకరణ: ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యాపార వృద్ధి కోసం ఈక్విటీ, రుణపత్రాల రూపంలో రూ.6,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో విడత గరిష్ఠంగా రూ.3,000 కోట్లు దాటకుండా విడతల వారీగా నిధుల సమీకరించేందుకు బోర్డు అనుమతించింది.

ఇవీ చదవండి:

1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్

ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 05:32 AM