Sensex Surges: సెన్సెక్స్ 329 పాయింట్లు అప్
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:25 AM
ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఫార్మా, బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడులతో సెన్సెక్స్ శుక్రవారం 328.72 పాయింట్ల వృద్ధితో...
ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఫార్మా, బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడులతో సెన్సెక్స్ శుక్రవారం 328.72 పాయింట్ల వృద్ధితో 82,500.82 వద్ద స్థిరపడింది. ఒక దశలో సూచీ 482 పాయింట్లు ఎగబాకి 82,654 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ విషయానికొస్తే, 103.55 పాయింట్ల లాభంతో 25,285.35 వద్ద ముగిసింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య సంధి కుదరడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో కొంత పురోగతి కన్పించడం ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..
ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..