Sensex Intraday Volatility: ఆటుపోట్ల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ నిఫ్టీ చెరోదారి
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:01 AM
తీవ్ర ఆటుపోట్ల మధ్య సాగిన ట్రేడింగ్‌లో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ చెరోదారిలో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లు అందించిన లాభాలను ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు తుడిచిపెట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్...
ముంబై: తీవ్ర ఆటుపోట్ల మధ్య సాగిన ట్రేడింగ్‌లో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ చెరోదారిలో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లు అందించిన లాభాలను ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు తుడిచిపెట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 715 పాయింట్ల మేరకు ఊగిసలాడి ఒక దశలో 80,321.19 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరికి 7.25 పాయింట్ల నష్టంతో 80,710.76 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 6.70 పాయింట్ల లాభంతో 24,741 వద్ద ముగిసింది. వారం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెన్సెక్స్ 901.11 పాయింట్లు, నిఫ్టీ 314.15 పాయింట్లు లాభపడ్డాయి. శుక్రవారం ఈక్విటీ మార్కెట్ ఎలాంటి మార్పు లేకుండా తటస్థంగానే ముగిసినప్పటికీ ఇంట్రాడే కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ సాధించడం స్వల్ప సానుకూలతను సూచిస్తోందని విశ్లేషకులంటున్నారు.
అదానీ పవర్ షేర్ల విభజన: అదానీ పవర్ తన షేర్లను 1:5 నిష్పత్తిలో విభజించనుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారులు షేర్ల విభజనకు ఆమోదం తెలిపారని రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో అదానీ పవర్ తెలిపింది. తగినంత మెజారిటీతో వాటాదారులు ఈ తీర్మానాన్ని ఆమోదించినట్టు వెల్లడించింది. రిటైల్, చిన్న ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెంచేందుకు తీసుకున్న ఈ చర్య కింద రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ గల 5 షేర్లుగా విభజిస్తారు.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..