Share News

Sensex Today: సెన్సెక్స్‌ 304 పాయింట్లు అప్‌

ABN , Publish Date - Aug 14 , 2025 | 02:03 AM

ఈక్విటీ మార్కెట్‌ బుధవారం లాభాల బాట పట్టింది. సెన్సెక్స్‌ 304.32 పాయింట్ల వృద్ధితో 80,539.91 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 131.95 పాయింట్లు పెరిగి 24,619.35 వద్ద ముగిసింది. జూలై నెలలో...

Sensex Today: సెన్సెక్స్‌ 304 పాయింట్లు అప్‌

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ బుధవారం లాభాల బాట పట్టింది. సెన్సెక్స్‌ 304.32 పాయింట్ల వృద్ధితో 80,539.91 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 131.95 పాయింట్లు పెరిగి 24,619.35 వద్ద ముగిసింది. జూలై నెలలో ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్ఠానికి జారుకోవడంతో వినియోగం మళ్లీ పుంజుకోనుందన్న అంచనాలు ఇందుకు దోహదపడ్డాయి.ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు పెరిగి రూ.87.47 వద్ద ముగిసింది.

ఫ్రాక్టల్‌ అనలిటిక్స్‌ రూ.4,900 కోట్ల ఐపీఓ: కృత్రిమ మేధ (ఏఐ) సేవలందించే ఫ్రాక్టల్‌ అనలిటిక్స్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌కు (ఐపీఓ) అనుమ తి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. దేశంలో ఐపీఓ ద్వారా స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావాలనుకుంటున్న తొలి ఏఐ కంపెనీ ఇదే. ముంబై కేంద్రంకా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ ఐపీఓలో భాగంగా రూ.1,279.3 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లకు చెందిన రూ.3,620.7 కోట్ల ఈక్విటీ వాటా షేర్ల విక్రయం ద్వారా మొత్తం రూ.4,900 కోట్లు సమీకరించాలనుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 02:03 AM