Share News

Indian Stock Market: సెన్సెక్స్‌ మరో 534 పాయింట్లు డౌన్‌

ABN , Publish Date - Dec 17 , 2025 | 05:56 AM

ఈక్విటీ మార్కెట్‌ వరుస నష్టాల నుంచి బయటపడలేకపోతోంది. నిరంతరాయంగా తరలిపోతున్న విదేశీ నిధులు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత...

Indian Stock Market: సెన్సెక్స్‌ మరో 534 పాయింట్లు డౌన్‌

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ వరుస నష్టాల నుంచి బయటపడలేకపోతోంది. నిరంతరాయంగా తరలిపోతున్న విదేశీ నిధులు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఒక దశలో 592.75 పాయింట్లు నష్టపోయి 84,620.61 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరికి ఆ నష్టాన్ని 533.50 పాయింట్లకు పరిమితం చేసుకుని 84,679.86 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 167.20 పాయింట్ల నష్టంతో 25,860.10 వద్ద క్లోజైంది.

ఇవీ చదవండి:

అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!

జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..

Updated Date - Dec 17 , 2025 | 05:56 AM