Indian Stock Market: ఐటీ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:54 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీ లు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 375.24 పాయింట్లు కోల్పోయి 82,259.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110.60 పాయింట్లు తగ్గి 25,111.45 వద్దకు జారుకుంది. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో...
సెన్సెక్స్ 375 పాయింట్లు డౌన్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీ లు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 375.24 పాయింట్లు కోల్పోయి 82,259.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110.60 పాయింట్లు తగ్గి 25,111.45 వద్దకు జారుకుంది. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు ఇందుకు కారణమయ్యాయి. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఈక్విటీ మదుపరులు వేచి చూసే ధోరణిలో ఉన్నారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, నిరాశాజనక త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయన్నారు. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోగా.. టెక్ మహీంద్రా షేరు అత్యధికంగా 2.76 శాతం క్షీణించింది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు మాత్రం 0.30 శాతం వరకు పెరిగాయి. రంగాలవారీ సూచీల్లో ఫోకస్డ్ ఐటీ 1.47 శాతం, ఐటీ 1.33 శాతం, టెక్ 1.06 శాతం, బ్యాంకెక్స్ 0.51 శాతం తగ్గాయి. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసల నష్టంతో రూ.86.12 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి