సెన్సెక్స్ ఐదో రోజూ డౌన్
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:21 AM
స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగాయి. రియల్టీ, ఐటీ, ఆటో రంగ షేర్లలో అమ్మకాలు ఇందుకు కారణమయ్యాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్ మరో 200.85 పాయింట్లు కోల్పోయి...

200 పాయింట్లు నష్టపోయిన సూచీ
ముంబై: స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగాయి. రియల్టీ, ఐటీ, ఆటో రంగ షేర్లలో అమ్మకాలు ఇందుకు కారణమయ్యాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్ మరో 200.85 పాయింట్లు కోల్పోయి 73,828.91 వద్దకు జారుకుంది. సూచీ నష్టపోవడం వరుసగా ఇది ఐదో రోజు. నిఫ్టీ విషయానికొస్తే, 73.30 పాయింట్లు క్షీణించి 22,397.20 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 8 రాణించగా.. 22 నష్టపోయాయి. జొమాటో షేరు 1.97 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. టాటా మోటార్స్, ఇండ్‌సఇండ్ బ్యాంక్ 1.95 శాతం వరకు తగ్గాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం అర శాతానికి పైగా పెరిగాయు. '
ఎల్‌జీ రూ.15,000 కోట్ల ఐపీఓకు సెబీ ఆమోదం: దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం ఎల్‌జీకి భారత అనుబంధ విభాగమైన ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ ఇండియా లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రతిపాదనకు సెబీ ఆమో దం తెలిపింది. ఐపీఓ ద్వారా ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ ఇండియాలో 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను మాతృసంస్థ విక్రయించనుంది. తద్వారా రూ.15,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది.
యూపీఎ్‌సఐ పరిధి పెంపు
సెబీ
క్యాపిటల్ మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ.. షేర్ల ధరలను ప్రభావితం చేయగలిగే అప్రకటిత సమాచారం (యూపీఎ్‌సఐ) పరిధిని మరింత విస్తరించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 11న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏదైనా ప్రతిపాదిత నిధుల సమీకరణ కార్యకలాపాలు, ఈఎ్‌సజీ రేటింగ్ మినహా ఇతర క్రెడిట్ రేటింగ్ సవరణ, యాజమాన్యం లేదా కంపెనీ నియంత్రణను ప్రభావితం చేసే ఒప్పందాలు, కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో పరిష్కార ప్రణాళికకు ఆమోదం, వన్‌టైం బ్యాంక్ సెటిల్‌మెంట్, రుణాల పునర్‌వ్యవస్థీకరణ, బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణాల సేకరణ సమాచారం కూడా యూపీఎ్‌సఐ పరిధిలోకి వస్తాయి. కాబట్టి, కంపెనీలు ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెంటనే వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు జూన్ 10 నుంచి అమలులోకి వస్తాయని సెబీ స్పష్టం చేసింది.
నేడు మార్కెట్లకు సెలవు
హోలీ పండగ సందర్భంగా శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు. సోమవారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Read More Business News and Latest Telugu News