రెండు రోజుల లాభాలకు బ్రేక్
ABN , Publish Date - May 28 , 2025 | 05:26 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో మదుపరులు లాభాలు స్వీకరించడంతో సెన్సెక్స్ మంగళవారం 624.82 పాయింట్లు క్షీణించి 81,551.63 వద్దకు జారుకుంది...
625 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో మదుపరులు లాభాలు స్వీకరించడంతో సెన్సెక్స్ మంగళవారం 624.82 పాయింట్లు క్షీణించి 81,551.63 వద్దకు జారుకుంది. ఒకదశలో సూచీ 1,054 పాయింట్లు కోల్పోయి 81,121.70 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 174.95 పాయింట్లు పతనమై 24,826.20 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టపోగా.. అలా్ట్రటెక్ సిమెంట్ షేరు 2.29 శాతం పతనమై సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. కాగా ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గి రూ.85.40 వద్ద ముగిసింది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి