Sensex-Nifty: చైనాపై సుంకాలు.. నష్టాల్లో దేశీ సూచీలు
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:16 AM
చైనాపై ట్రంప్ సుంకాల హెచ్చరికలతో దేశీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. ఊహించినట్టుగా దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఊహించినట్టుగా సోమవారం దేశీయ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. చమురు, సహజ వాయువు రంగాల షేర్ల నష్టాలు, అమెరికా, చైనా వాణిజ్య ప్రతిష్ఠంభన, సుంకాల భయాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి సెన్సెక్స్ 418 పాయింట్లు నష్టపోయి 82,000 వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు కోల్పోయి 25,200 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.76గా ఉంది (Benchmark Indices face losses)
ఆసియా మార్కెట్లు కూడా నష్టాలను చవి చూస్తున్నాయి. హాంకాంగ్ ప్రామాణిక హాంగ్ సెంగ్ సూచీ 3.49 శాతం మేర క్షీణించి 916.89 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చైనా, అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. సోమవారం ఔన్స్ బంగారం స్పాట్ ధర 4,044 డాలర్లకు పెరిగింది. ఇక గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు కూడా 4,062 డాలర్ల వద్దు ఉన్నాయి.
ఇక సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ లాభాలు బాటలో ఉన్నాయి. అమెరికా మార్కెట్ నుంచి జనరిక్ ఔషధాలకు డిమాండ్ యథాతథంగా కొనసాగుతుండటంతో ఫార్మా షేర్లకు కలిసొచ్చే అంశం.
ఇవీ చదవండి:
బంగారం ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
రాంగ్ నంబర్‌కు యూపీఐ పేమెంట్ చేశారా.. ఇలా రిఫండ్ పొందండి..!
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి