Share News

74,000 పైకి సెన్సెక్స్‌

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:45 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 609.86 పాయింట్లు బలపడి 74,340.09 వద్దకు చేరుకుంది....

74,000 పైకి సెన్సెక్స్‌

రూ.4.54 లక్షల కోట్ల సంపద వృద్ధి

  • 22,500 స్థాయిని దాటిన నిఫ్టీ

  • వరుసగా రెండో రోజూ లాభాలు

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 609.86 పాయింట్లు బలపడి 74,340.09 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 207.40 పాయింట్ల వృద్ధితో 22,544.70 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కె ట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారి్‌ఫల విషయంలో కాస్త మెత్తబడటం మార్కెట్‌ ర్యాలీకి దోహదపడ్డాయి. ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4.54 లక్షల కోట్ల మేర పెరిగి రూ.397.58 లక్షల కోట్లకు చేరుకుంది.


  • నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్‌ ఆయిల్‌) తన మైనారిటీ షేర్‌హోల్డర్ల నుంచి 2.59 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ రూ.731 చొప్పున తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేయనున్నట్లు తెలిపింది.

ఐఐఎ్‌ఫఎల్‌ క్యాపిటల్‌కు అవంతి ఫీడ్స్‌లో మరో 4.4ు వాటా

ఐఐఎ్‌ఫఎల్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ అనుబంధ విభాగమైన ఐఐఎ్‌ఫఎల్‌ ఫెసిలిటీస్‌ సర్వీసె్‌స..ఓపెన్‌ మార్కెట్లో బ్లాక్‌ డీల్‌ ద్వారా హైదరాబాద్‌కు చెందిన అవంతి ఫీడ్స్‌లో మరో 4.4 శాతం వాటాను రూ.470 కోట్లకు దక్కించుకుంది. ఈ మంగళవారం కూడా ఐఐఎ్‌ఫఎల్‌ సర్వీసెస్‌ అవంతీ ఫీడ్స్‌లో 4.4 శాతం వాటాను రూ.435 కోట్లకు కొనుగోలు చేసింది.

నాలెడ్జ్‌ రియల్టీ ట్రస్ట్‌ రూ.6,200 కోట్ల రీట్స్‌ ఇష్యూ

ప్రముఖ రియల్టీ కంపెనీ సత్వ గ్రూప్‌, అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ స్పాన్సర్లుగా ఉన్న నాలెడ్జ్‌ రియల్టీ ట్రస్ట్‌.. రీట్స్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌) పబ్లిక్‌ ఇష్యూకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.6,200 కోట్లకు పైగా సమీకరించాలనుకుంటోంది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 07 , 2025 | 06:45 AM