Share News

SEBI Alert: డిజిటల్‌ గోల్డ్‌కు రక్షణ లేదా

ABN , Publish Date - Nov 09 , 2025 | 05:55 AM

దేశంలో డిజిటల్‌ గోల్డ్‌, ఆన్‌లైన్‌ పసిడి పథకాల్లో పెట్టుబడులు ఊపందుకున్న నేపథ్యంలో అనియంత్రిత వేదికలు, సంస్థల ద్వారా కొనుగోళ్లపై క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ హెచ్చరించింది..

SEBI Alert: డిజిటల్‌ గోల్డ్‌కు రక్షణ లేదా

అనియంత్రిత ప్లాట్‌ఫామ్స్‌, సంస్థల ద్వారా

పసిడిలో పెట్టుబడులపై ప్రజలను హెచ్చరించిన సెబీ

ముంబై: దేశంలో డిజిటల్‌ గోల్డ్‌, ఆన్‌లైన్‌ పసిడి పథకాల్లో పెట్టుబడులు ఊపందుకున్న నేపథ్యంలో అనియంత్రిత వేదికలు, సంస్థల ద్వారా కొనుగోళ్లపై క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ హెచ్చరించింది. ‘‘కొన్ని డిజిటల్‌/ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఇన్వెస్టర్లకు పసిడి లోహం కొనుగోళ్లకు ప్రత్యామ్నాయంగా డిజిటల్‌ గోల్డ్‌ లేదా ఈ-గోల్డ్‌ సాధనాలను ఆఫర్‌ చేస్తున్నట్లు సెబీ దృష్టికి వచ్చింది. అయితే, వాటిలో పెట్టుబడులకు రక్షణ ఉండదని, సెక్యూరిటీస్‌ లేదా కమోడిటీ డెరివేటివ్స్‌గా గుర్తింపు లేనందున అవి సెక్యూరిటీస్‌ మార్కెట్‌ రక్షణ పరిధిలోకి రావని’’ శనివారం విడుదల చేసిన ప్రకటనలో సెబీ స్పష్టం చేసింది. ఈ-గోల్డ్‌ లేదా డిజిటల్‌ గోల్డ్‌ స్కీమ్‌లు సె క్యూరిటీస్‌ మార్కెట్‌ పరిధికి వెలుపల పనిచేస్తాయి గనుక వాటిల్లో పెట్టుబడులకు తమ రక్షణ ఉండదని తెలిపింది.

నియంత్రణ పథకాలకే సెబీ రక్షణ

పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు నియంత్రిత సంస్థల ద్వారా ఇప్పటికే పలు సాధనాలను అందుబాటులోకి తేవడం జరిగిందని సెబీ పేర్కొంది. ఎక్స్ఛేంజీలో ట్రేడయ్యే గోల్డ్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులు, మ్యూచువల్‌ ఫండ్లు ఆఫర్‌ చేసే గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్లు (ఈటీఎఫ్‌), స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఎలకా్ట్రనిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌) ఇందుకు ఉదాహరణలు. సెబీ చట్టం పరిధిలోకి వచ్చే సంస్థలు ఆఫర్‌ చేసే బంగారం పథకాల్లో పెట్టుబడులు..మాత్రమే మా పర్యవేక్షణ,రక్షణ నియమావళి పరిధిలోకి వస్తాయని నియంత్రణ మండలి స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ

Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 05:55 AM