SEBI Warns Investors: సందేశాలపై తస్మాత్ జాగ్రత్త సెబీ
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:47 AM
సెబీ పేరిట సామాజిక మాధ్యమ వేదికలపై సర్క్యులేట్ అవుతున్న సందేశాలు, నోటీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. అలాంటి మోసపూరిత....
న్యూఢిల్లీ: సెబీ పేరిట సామాజిక మాధ్యమ వేదికలపై సర్క్యులేట్ అవుతున్న సందేశాలు, నోటీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. అలాంటి మోసపూరిత సందేశాలకు స్పందించి వ్యక్తిగత సమాచారం ఏదీ పంచుకోవద్దని సూచించింది. ఇన్వెస్టర్లను తమ ఉచ్చులోకి లాగేందుకు మోసగాళ్లు సెబీ లోగో, లెటర్‌హెడ్, సీల్ కూడా కాపీ చేసిన సందర్భాలున్నట్టు తెలియచేసింది. భిన్న రకాల ఉల్లంఘనలపై రెగ్యులేటరీ చర్యలను నివారించుకునేందుకు పెనాల్టీలు లేదా ఫైన్ చెల్లించాలన్న బెదిరింపులు ఆ సందేశాల్లో వ్యాపింపచేస్తున్నట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..