బ్రైట్‌కామ్ గ్రూప్‌నకు సెబీ షాక్
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:39 AM
వాటాదారులను నిండా ముంచిన హైదరాబాద్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ (బీజీఎల్)కు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ పెద్ద షాకిచ్చింది. ఈ కంపెనీపైన, కంపెనీ ప్రమోటర్లు, ఇతరులపై...
రూ.34 కోట్ల భారీ జరిమానా
కంపెనీ ప్రమోటర్లపై ఐదేళ్ల పాటు నిషేధం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వాటాదారులను నిండా ముంచిన హైదరాబాద్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ (బీజీఎల్)కు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ పెద్ద షాకిచ్చింది. ఈ కంపెనీపైన, కంపెనీ ప్రమోటర్లు, ఇతరులపై రూ.34 కోట్ల భారీ జరిమానా విధించింది. ఇందులో కంపెనీ ప్రధాన ప్రమోటర్లు ఎం సురేశ్ కుమార్ రెడ్డి, కంచర్ల విజయ్ చెరో రూ.15 కోట్ల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దీనికి తోడు వీరిద్దరు ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా వేటు వేసింది. అంతేకాకుండా వీరిద్దరూ ఏ కంపెనీలోగానీ, సెబీ వద్ద నమోదైన సంస్థల్లోగానీ ఐదేళ్ల పాటు కీలక మేనేజ్‌మెంట్ పదవులు చేపట్టకూడదని స్పష్టం చేసింది. దీనికి తోడు కంపెనీ ఇతర డైరెక్టర్లు వై శ్రీనివాస రావుపై రూ.2 కోట్లు, ఎర్రదొడ్డి రమేష్ రెడ్డి, బీజీఎల్‌పై చెరో రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. తప్పుడు రికార్డుల ద్వారా లేని టర్నోవర్, లాభాలు ఉన్నట్టు చూపి వీరు కంపెనీ షేర్ల విలువను భారీగా పెంచి, తమ వాటా షేర్లు అమ్ముకుని మదుపరులను నిండా ముంచినట్లు తేలడంతో సెబీ ఈ చర్య తీసుకుంది.
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News