Share News

ప్రస్తుతానికైతే ‘టీ జీరో’ ట్రేడింగ్‌ ఐచ్ఛికమే

ABN , Publish Date - May 05 , 2025 | 05:46 AM

స్టాక్‌ మార్కెట్లో ప్రస్తుతానికైతే టీ జీరో ట్రేడింగ్‌ ఐచ్ఛికమని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ స్పష్టం చేసింది. అయితే ఈ వెసులుబాటు మార్కెట్‌ వర్గాలు క్రమంగా...

ప్రస్తుతానికైతే ‘టీ జీరో’ ట్రేడింగ్‌ ఐచ్ఛికమే

ఏఐ రెండు వైపులా పదునున్న కత్తి సెబీ చీఫ్‌ పాండే

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లో ప్రస్తుతానికైతే టీ+జీరో ట్రేడింగ్‌ ఐచ్ఛికమని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ స్పష్టం చేసింది. అయితే ఈ వెసులుబాటు మార్కెట్‌ వర్గాలు క్రమంగా ఈ విధానానికి మారేందుకు దోహదం చేస్తుందని సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే చెప్పారు. షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు, నగదు చెల్లింపుల ప్రక్రియ ఒకేరోజు ముగిసే విధానాన్ని టీ+జీరో సెటిల్‌మెంట్‌ అంటారు. సెబీ ప్రస్తుతం ఈ విధానాన్ని తప్పనిసరి పద్దతిలో కాకుండా ఐచ్ఛిక పద్దతిలోనే అమలు చేస్తోంది. కాగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపైనా సెబీ చీఫ్‌ మాట్లాడుతూ.. ఈ సరికొత్త టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదన్నారు. నియంత్రణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు సెబీ ఇప్పటికే ఏఐని వినియోగిస్తోందన్నారు. ప్రస్తుతం ఐపీఓ పత్రాల ప్రాసెసింగ్‌, ఇతర కార్యకలాపాల పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. ఏఐ టూల్స్‌ సాయంతో సోషల్‌ మీడియాలో వచ్చే అనధికారిక ఆర్థిక సలహా సేవలకు చెక్‌ పెడుతున్నట్టు పాండే చెప్పారు.


కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర ఆర్థిక రెగ్యులేటరీ సంస్థలతో కలిసి కేంద్రీకృత నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) వ్యవస్థ ఏర్పాటు కోసం పని చేస్తున్నట్టు పాండే వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీ ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందన్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే కేవైసీ విధానం అత్యంత సులభమవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి:

పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్

ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..

వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్

Read More Business News and Latest Telugu News

Updated Date - May 05 , 2025 | 06:00 AM