RD Engineering IPO: ఆర్డీ ఇంజనీరింగ్ ఇష్యూకు సెబీ ఓకే
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:29 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్డీ ఇంజనీరింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.580 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇష్యూలో భాగంగా రూ.500 కోట్లకు కొత్తగా...
రూ.580 కోట్ల సమీకరణ లక్ష్యం
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్డీ ఇంజనీరింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.580 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇష్యూలో భాగంగా రూ.500 కోట్లకు కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుండగా ప్రమోటర్ చంద్రశేఖర్ మోటూరు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా రూ.80 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నట్లు ఐపీఓ ముసాయిదా పత్రాల్లో వెల్లఢించింది. ఈ ఏడాది మార్చి నెలలో కంపెనీ ఐపీఓకి దరఖాస్తు చేసింది. ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తాల్లో రూ.279.60 కోట్లను తెలంగాణలోని సీతారాంపూర్‌లో కొత్తగా రెండు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వినియోగించనుంది. అలాగే ఆంధప్రదేశ్‌లోని పరవాడలో రూ.44.8 కోట్లతో సమీకృత మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.65 కోట్ల మొత్తాలను సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది.
సగ్స్ లాయడ్ ఇష్యూ ధర రూ.117-123: ఇంటిగ్రేటెడ్ ఈపీసీ కంపెనీ సగ్స్ లాయడ్ పబ్లిక్ ఇష్యూ వచ్చే శుక్రవారం ప్రారంభమై మంగళవారంతో (సెప్టెంబరు 2) ముగియనుంది. షేరు ధరల శ్రేణిని రూ.117-123గా ప్రకటించారు.
ఇవీ చదవండి:
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డీల్
ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి