Q2 GDP Growth: క్యూ2 జీడీపీ వృద్ధి 7.5 శాతం
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:26 AM
సెప్టెంబరు చివరిలో జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో పండగల సీజన్ కొనుగోళ్లు జోరుగా సాగడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2)లో వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా...
ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా
న్యూఢిల్లీ: సెప్టెంబరు చివరిలో జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో పండగల సీజన్ కొనుగోళ్లు జోరుగా సాగడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2)లో వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో అంచనా వేసింది. దీనికి తోడు పెట్టుబడి కార్యకలాపాలు పుంజుకోవడం, గ్రామీణ వినియోగం పెరగడం, సేవలు/తయారీ రంగాల జోరు వృద్ధికి ఊతం ఇచ్చే అంశాలని పేర్కొంది. అలాగే వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో వినియోగం, డిమాండుకు దర్పణం పట్టే ప్రధాన సూచికల వేగం 70ు నుంచి 83 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ఇవన్నీ జీడీపీ 7.5 శాతానికి చేరేందుకు దోహదపడే అంశాలేనని ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధనా విభాగం రూపొందించిన ఆ నివేదిక పేర్కొంది. రెండో త్రైమాసికానికి ఆర్‌బీఐ ప్రకటించిన వృద్ధి అంచనా 7 శాతం కన్నా ఇది అధికం. ప్రభుత్వం ఈ నెలాఖరులో జూలై-సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ అధికారిక గణాంకాలను ప్రకటించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే
Read Latest AP News And Telugu News