ఎస్‌బీఐ లాభం రూ.18,642 కోట్లు
ABN , Publish Date - May 04 , 2025 | 02:24 AM
మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఎస్‌బీఐ స్టాండ్‌ఎలోన్ నికర లాభం రూ.18,642 కోట్లకు పరిమితమైంది. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి...
మార్చి త్రైమాసికంలో 10% క్షీణత
ఒక్కో షేరుకు రూ.15.90 డివిడెండ్
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఎస్‌బీఐ స్టాండ్‌ఎలోన్ నికర లాభం రూ.18,642 కోట్లకు పరిమితమైంది. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.20,698 కోట్ల లాభంతో పోలిస్తే 10 శాతం తగ్గింది. మొండి బాకీలు, ఇతర అవసరాల కోసం కేటాయింపులు గణనీయంగా పెరగడంతో పాటు నికర వడ్డీ మార్జిన్ తగ్గ డం ఇందుకు ప్రధాన కారణం. బ్యాంకు మొత్తం ఆదాయం మాత్రం రూ.1,28,412 కోట్ల నుంచి రూ.1,43,876 కోట్లకు పెరిగింది. అందులో వడ్డీ ఆదాయం రూ.1,11,043 కోట్ల నుంచి రూ.1,19,666 కోట్లకు ఎగబాకింది. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 2.7 శాతం వృద్ధితో రూ.42,774.55 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) మాత్రం 0.32 శాతం తగ్గి 3.15 శాతానికి పరిమితమైంది. గత 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.15.90 డివిడెండ్ ప్రకటించింది. గడిచిన 12 ఏళ్లలో ఎస్‌బీఐ చెల్లించబోయే అత్యధిక డివిడెండ్ ఇదే. మరిన్ని ముఖ్యాంశాలు..
క్యూ4లో ఎస్‌బీఐ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 8 శాతం తగ్గి రూ.19,600 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.1,79,562 కోట్లకు పెరిగింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు స్టాండ్‌ఎలోన్ లాభం రూ.70,901 కోట్లు, మొత్తం రాబడి రూ.5,24,172 కోట్లుగా నమోదైంది. ఇదే కాలానికి ఏకీకృత లాభం రూ.79,017 కోట్లు, మొత్తం రాబడి రూ.6,63,343 కోట్లు గా ఉంది.
బ్యాంక్ ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడింది. ఈ మార్చి 31 నాటికి ఎస్‌బీఐ మొండి బకాయిలు (స్థూల ఎన్‌పీఏ) 1.82 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.47 శాతానికి జారుకున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో క్యూఐపీ లేదా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎ్‌ఫపీఓ) లేదా ఇతర మార్గాల్లో రూ.25,000 కోట్ల వరకు సమీకరించేందుకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది.
వాణిజ్య యుద్ధంతో రుణ వృద్ధిపై ప్రభావం
ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి
మున్ముందు ఆర్‌బీఐ రెపో రేటును మరింత తగ్గించే అవకాశాలున్నా యి. దాంతో రుణాలపై వడ్డీ రేట్లు కూడా మరిం త తగ్గుముఖం పట్టనున్నాయిని, ఇది బ్యాంకు మార్జిన్లపై ఒత్తిడి పెంచనుందని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. ఈ ఏడాదిలో ఆర్‌బీఐ రెపో రేటును మరో 0.50 శాతం తగ్గించవచ్చని భావిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12-13 శాతం రుణ వృద్ధి సాధించాలని ఎస్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ట్రంప్ సుంకాలతో మొదలైన వాణిజ్య యుద్ధంతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పెరిగింది. దీంతో కంపెనీల పెట్టుబడులు మందగించవచ్చని, ఇది రుణ వృద్ధి పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని శెట్టి అన్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐ కార్పొరేట్ లోన్ బుక్ రూ.3.4 లక్షల కోట్లుగా ఉంది.
ఈసారి 18,000 నియామకాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ దశాబ్ద గరిష్ఠ స్థాయిలో 18,000 నియామకాలు చేపట్టనుందని శ్రీనివాసులు శెట్టి తెలిపారు. అందులో 13,400 మంది క్లర్కులు, 3,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1,600 మంది ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన అధికారులను నియమించుకోనున్నట్లు శెట్టి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
India Pakistan Relations: పహల్గామ్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
RCB vs CSK Rain Update: ఆర్సీబీ vs సీఎస్‌కే మ్యాచుకు వర్షం ఎఫెక్ట్..రద్దైతే ఏంటి పరిస్థితి..
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
RCB vs CSK: నేడు ఆర్బీబీ vs చెన్నై మ్యాచ్..ప్లే ఆఫ్ ఆశలు ముంచుతుందా..
Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్
Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
Read More Business News and Latest Telugu News