SBI Digital Banking: ఎస్‌బీఐ యోనో 2.0 యాప్
ABN , Publish Date - Dec 16 , 2025 | 06:12 AM
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తన డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా యోనో 2.0 పేరుతో కొత్త యాప్‌ను విడుదల చేసింది...
మార్చిలోగా 10,000 మంది నియామకం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తన డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా యోనో 2.0 పేరుతో కొత్త యాప్‌ను విడుదల చేసింది. బ్యాంకు శాఖల్లో ఈ యాప్ వినియోగంపై ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు వచ్చే ఏడాది మార్చిలోగా 10,000 మంది ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌లు లేదా ఫ్లోర్ మేనేజర్లను నియమిస్తామని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. ఇందు లో ఇప్పటికే 3,500 మంది నియామకం పూర్తయినట్టు తెలిపారు. యోనో 2.0 యాప్ ద్వారా గూగుల్ పే, ఫోన్‌పే వంటి దిగ్గజ పేమెంట్ యాప్స్‌తో పోటీపడబోతున్నట్టు చెప్పారు. తమ సరికొత్త యోనో 2.0 యాప్‌ను టాబ్లెట్, మొబైల్, డెస్క్‌టా్‌ప్స ద్వారా ఉపయోగించవచ్చన్నారు.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..