స్థిరమైన వృద్ధిపై దృష్టి
ABN , Publish Date - May 27 , 2025 | 03:01 AM
క్రమశిక్షణతో కూడిన వ్యయ నిర్వహ ణ, తక్కువ ఖర్చుతో డిపాజిట్ల సేకరణ, రుసుము ఆదాయ విస్తరణ ఆధారంగా స్థిరమైన రాబడుల కోసం క్రమమైన వృద్ధి నమూనాను నిర్మిస్తున్నామ ని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి...
ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి
న్యూఢిల్లీ: క్రమశిక్షణతో కూడిన వ్యయ నిర్వహ ణ, తక్కువ ఖర్చుతో డిపాజిట్ల సేకరణ, రుసుము ఆదాయ విస్తరణ ఆధారంగా స్థిరమైన రాబడుల కోసం క్రమమైన వృద్ధి నమూనాను నిర్మిస్తున్నామ ని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నా రు. ‘‘ఈ వ్యూహాల కలయిక మమ్మల్ని దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గానే కాకుండా భవిష్యత్ ధృక్పథంతో కూడిన సంస్థగా నిలబెట్టనుంది’’ అని ఎస్‌బీఐ వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ.70,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24లో గడించిన రూ.61,077 కోట్ల లాభంతో పోలిస్తే 16 శాతం వృద్ధి కనబరిచింది.
వార్షిక నివేదికలో ఎస్‌బీఐ చైర్మన్ ప్రస్తావించిన మరిన్ని విషయాలు..
స్థిరమైన, రిస్క్‌ను సర్దుబాటు చేసుకోగలిగే వృద్ధిని సాధించేందుకు ఎస్‌బీఐ క్రెడిట్ అండర్ రైటింగ్, పోర్ట్‌ఫోలియో మానిటరింగ్, సంస్థాగత ముప్పుపై ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు వీలుగా ఆధునిక అనలిటిక్స్ టూల్స్‌ను ఉపయోగిస్తున్నాం.
ఆస్తుల నాణ్యతను పెంచడంతోపాటు ఎంఎ్‌సఎంఈ, మౌలికం వంటి ప్రాధాన్య రంగాలకు రుణ మద్దతిచ్చేలా రంగాల వారీ రిస్క్ ఫ్రేమ్‌వర్స్‌ను రూపొందించాం.
కార్యనిర్వహణ దక్షత, కస్టమర్ల అనుభూతిని మరింత మెరుగుపరచడంతో పాటు స్థిరమైన మార్కెట్ ఆధిపత్యం, మానవ వనరుల సామర్థాల బలోపేతం, రిస్క్‌ను సర్దుబాటు చేసుకోగలిగే వృద్ధికి మద్దతు, లాభదాయకతను పెంచుకోవడంపై ఎస్‌బీఐ దృష్టిసారించింది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి