సామ్‌సంగ్ నుంచి ఏడో తరం ఫోల్డబుల్ ఫోన్లు
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:41 AM
దక్షిణ కొరియాకు చెందిన ఎలకా్ట్రనిక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ఫోల్డబుల్ (మడత పెట్టగలిగే) గెలాక్సీ సిరీ్‌సలో ఏడో తరం మోడళ్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 తో పాటు...
ప్రారంభ ధర రూ.89,999
న్యూయార్క్: దక్షిణ కొరియాకు చెందిన ఎలకా్ట్రనిక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ఫోల్డబుల్ (మడత పెట్టగలిగే) గెలాక్సీ సిరీ్‌సలో ఏడో తరం మోడళ్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 తో పాటు గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్‌ఈ ఫోన్లను అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఆవిష్కరించింది. సామ్‌సంగ్ ఇప్పటివరకు మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఫోల్డబుల్ ఫోన్లలో ఫోల్డ్7 అత్యంత సన్నదైన, తేలికపాటి మోడల్. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 8 అంగుళాల డిస్‌ప్లే, 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన ఈ ఫోన్ కేవలం 215 గ్రాముల బరువు, మడత పెట్టినప్పుడు 8.9 మిల్లీమీటర్ల మందం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. బుధవారం నుంచి ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించిన కంపెనీ.. ఈనెల 25 నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. భారత మార్కెట్లో ఫోల్డ్7 ధర రూ.1,74,999 నుంచి ప్రారంభం కానుండగా.. ఫ్లిప్7 ప్రారంభ ధర రూ.1,09,999గా ఉంది. ఫ్లిప్7 ఎఫ్‌ఈ రేటు రూ.89,999 నుంచి ప్రారంభమవుతుంది.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి