Share News

Reliance Consumer Product: ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో రూ 65000 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:30 AM

భారత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.65,000 కోట్ల పెట్టుబడులకు రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీపీఎల్‌), మరో మూడు కోకా-కోలా బాట్లింగ్‌ కంపెనీలు ముందుకు...

Reliance Consumer Product: ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో రూ 65000 కోట్ల పెట్టుబడులు

కర్నూలులో రిలయన్స్‌ప్లాంట్‌

తెలంగాణ, ఏపీల్లో కోకా-కోలా బాట్లింగ్‌ ప్లాంట్లు

న్యూఢిల్లీ: భారత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.65,000 కోట్ల పెట్టుబడులకు రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీపీఎల్‌), మరో మూడు కోకా-కోలా బాట్లింగ్‌ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ మొత్తంలో ఆర్‌సీపీఎల్‌ ఒక్కటే రూ.40,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఢిల్లీలో గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా సదస్సు తొలి రోజునే ఇందుకు సంబంధించిన ఎంఓయూలపై సంతకాలు చేసినట్టు కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఈ సదస్సులో రూ.లక్ష కోట్ల మేరకు పెట్టుబడి ఒప్పందాలు కుదరవచ్చన్న ఆశాభావం ప్రకటించారు. కాగా ఆర్‌సీపీఎల్‌ రూ.1,500 కోట్లకు పైగా పెట్టుబడితో సమీకృత ఆహార, పానీయ ఉత్పత్తుల తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయనుందన్నారు. మహారాష్ట్రలోని కటోల్‌, నాగ్‌పూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.మరోవైపు ఎస్‌ఎల్‌ఎంజీ బెవరేజెస్‌, హిందుస్తాన్‌ కోకా-కోలా బెవరేజెస్‌, కాంధారీ గ్రూప్‌ కంపెనీలు ఉమ్మడిగా రూ.25,760 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక ల్లో కొత్త బాట్లింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి.

ఇవి కూడా చదవండి..

పెంపుడు కుక్క ఎంత పని చేసింది.. పెద్దలు ఇంట్లో లేని సమయంలో దారుణం..

ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..

షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..

Updated Date - Sep 26 , 2025 | 05:30 AM