Rupee all-time low: జీవితకాల కనిష్టానికి రూపాయి.. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువెంత..
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:00 AM
రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణిస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ట స్థాయిని తాకింది. మునుపటి సెషన్‌లో 88.32 వద్ద స్థిరపడిన రూపాయి విలువ మంగళవారం మరింత దిగజారింది. చరిత్రలో తొలిసారి 88.50ని దాటింది.
రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణిస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ట స్థాయిని తాకింది. మునుపటి సెషన్‌లో 88.32 వద్ద స్థిరపడిన రూపాయి విలువ మంగళవారం మరింత దిగజారింది. చరిత్రలో తొలిసారి 88.50ని దాటింది. ఈ రోజు రూపాయి ట్రేడింగ్ పరిధి 88.15 - 88.50 మధ్యలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు (INR vs USD 88.50).
భారతీయ వస్తువులపై అమెరికా సుంకాలు పెరగడం, హెచ్1బీ వీసాలపై రుసుము లక్ష డాలర్లకు చేరడం వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది (rupee dollar rate). ఇక, సోమవారం దేశీయ మార్కెట్‌లో ఎఫ్‌పీఐలు, రూ. 2,900 కోట్ల షేర్లను విక్రయించడం కూడా నెగిటివ్‌గా మారింది.
కాగా, సెప్టెంబర్ ప్రారంభంలో రూపాయి యూఎస్ డాలర్‌తో పోలిస్తే 88.44 వద్ద ముగిసింది (INR depreciation). ఇది అప్పటికి ఆల్ టైమ్ కనిష్టం. ఆ తర్వాత కాస్త కోలుకున్న రూపాయి ఈ రోజు 88.50 వద్దకు చేరుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి..
మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
మరిన్ని క్రీడా, అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..