Share News

Reliance Retail: రిలయన్స్‌ రిటైల్‌ గూటికి యూకే కంపెనీ

ABN , Publish Date - Jul 04 , 2025 | 05:00 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) రిటైల్‌ అనుబంధ విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) మరో కొనుగోలు జరిపింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)కు...

Reliance Retail: రిలయన్స్‌ రిటైల్‌ గూటికి యూకే కంపెనీ

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) రిటైల్‌ అనుబంధ విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) మరో కొనుగోలు జరిపింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)కు చెందిన ఫేషియల్‌ ఫిట్‌నెస్‌, స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ఫేస్‌జిమ్‌లో మైనారిటీ వాటాను చేజిక్కించుకుంది. అయితే, ఈ ఒప్పందం విలువ మాత్రం వెల్లడించలేదు. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఫేస్‌జిమ్‌ ఉత్పత్తులను భారత మార్కెట్లో ఆర్‌ఆర్‌వీఎల్‌ ప్రవేశపెట్టనుంది.

ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం కోసం కొత్త కంపెనీ ఏర్పాటు: ఆర్‌ఆర్‌వీఎల్‌ వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తోం ది. ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్ల వ్యాపారాన్ని విభజించి ‘న్యూ రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌’ (న్యూ ఆర్‌సీపీఎల్‌) పేరిట కొత్త కంపెనీని ఏర్పాటు చేయనుంది. ఇందుకు ఎన్‌సీఎల్‌టీ అనుమతి కోరింది.

ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 05:00 AM