Share News

Reliance Industries: ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500లో రిలయన్స్‌ 88వ స్థానం

ABN , Publish Date - Jul 31 , 2025 | 02:26 AM

ఈ ఏడాదికిగాను ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల జాబితాను ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ ఫార్చ్యూన్‌ బుధవారం విడుదల చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు ఈ లిస్ట్‌లో 88వ స్థానం దక్కింది. గత ఏడాది 86వ స్థానంలో ఉండగా...

Reliance Industries: ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500లో రిలయన్స్‌ 88వ స్థానం

న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల జాబితాను ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ ఫార్చ్యూన్‌ బుధవారం విడుదల చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు ఈ లిస్ట్‌లో 88వ స్థానం దక్కింది. గత ఏడాది 86వ స్థానంలో ఉండగా.. ఈసారి ర్యాంకింగ్‌ రెండు స్థానాలు జారుకుంది. 2021లో 155వ స్థానంలో నిలిచిన ఆర్‌ఐఎల్‌.. గడిచిన నాలుగేళ్లలో 67 స్థానాలు ఎగబాకింది. ఈ లిస్ట్‌లో రిలయన్స్‌కు చోటు దక్కడం వరుసగా ఇది 22వ సంవత్సరం. కాగా, ‘2025 ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500’ జాబితాలో భారత్‌ నుంచి 9 కంపెనీలకు స్థానం దక్కింది. వాటిలో 5 ప్రభుత్వ రంగానివి కాగా.. మిగతా నాలుగు ప్రైవేట్‌ కంపెనీలు. ఈ మార్చి 31 నాటికి కంపెనీల వార్షికాదాయం ఆధారంగా ఫార్చ్యూన్‌ ఈ జాబితాను రూపొందించింది. అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ మరోసారి ప్రపంచ నం.1గా కొనసాగగా.. అంతర్జాతీయ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ రెండో స్థానంలో ఉంది. టాప్‌-10లో 3 చైనా కంపెనీలకు చోటు దక్కింది. సౌదీ అరేబియాకు చెందిన చమురు ఉత్పత్తి దిగ్గజం సౌదీ అరామ్కో నాలుగో స్థానంలో నిలిచింది. ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు 8వ స్థానం లభించింది.

ఇవి కూడా చదవండి

రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 02:26 AM