Reliance Plans Investment in AI Infrastructure: ఏఐ ఇన్‌ఫ్రాపై రిలయన్స్
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:08 AM
రిలయన్స్ ఇండస్ర్టీస్ కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతులపై దృష్టి సారిస్తోంది. రాబోయే కొన్నేళ్లలో ఒక గిగావాట్ డేటా సెంటర్ ప్రారంభించడం సహా ఏఐ మౌలిక సదుపాయాలపై 1,200 నుంచి 1,500 కోట్ల డాలర్ల (రూ.1.03-1.29 లక్షల కోట్లు) ఇన్వెస్ట్...
రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ర్టీస్ కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతులపై దృష్టి సారిస్తోంది. రాబోయే కొన్నేళ్లలో ఒక గిగావాట్ డేటా సెంటర్ ప్రారంభించడం సహా ఏఐ మౌలిక సదుపాయాలపై 1,200 నుంచి 1,500 కోట్ల డాలర్ల (రూ.1.03-1.29 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. రిలయన్స్ ఇంటలిజెన్స్ పేరిట ఒక కొత్త అనుబంధ సంస్థ ప్రారంభించడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా తాము ఏఐకి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు గత ఆగస్టులో జరిగిన వాటాదారుల సమావేశంలో అంబానీ తెలిపారు. రిలయన్స్ ప్రతి దశాబ్దికి ఒకసారి తన సామ్రాజ్యాన్ని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పునర్నిర్మించుకుంటుందని, ఇప్పుడు కంపెనీ ఈక్విటీ కథనాన్ని ఏఐ పునర్నిర్మించనుందని మోర్గాన్ స్టాన్లీ ఆ నివేదికలో తెలిపింది. దేశంలోనే అతి పెద్దదైన డేటా సెంటర్ తొలి దశ నిర్మాణం జామ్‌నగర్‌లో వేగంగా సాగుతోందని, వ్యాపార సంస్థల డిమాండ్‌కు అనుగుణంగా దాన్ని మరింతగా విస్తరించుకుంటూ పోతామని అప్పట్లో రిలయన్స్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
హైదరాబాద్ యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ హబ్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి