Share News

వ్యక్తిగత రుణాన్ని తిరస్కరించారా!

ABN , Publish Date - May 04 , 2025 | 02:30 AM

కొన్ని ఆర్థిక అవసరాలు ఆకస్మికంగా వస్తుంటాయి. వాటిని భరించేందుకు చేతిలో సరిపడా డబ్బులు ఉండకపోవచ్చు. అప్పుడు ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది వ్యక్తిగత రుణాలే. అయితే ఒక్కోసారి ఈ రుణ దరఖాస్తులను...

వ్యక్తిగత రుణాన్ని తిరస్కరించారా!

అయితే ఈ గండం నుంచి గట్టెక్కడం ఎలా?

కొన్ని ఆర్థిక అవసరాలు ఆకస్మికంగా వస్తుంటాయి. వాటిని భరించేందుకు చేతిలో సరిపడా డబ్బులు ఉండకపోవచ్చు. అప్పుడు ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది వ్యక్తిగత రుణాలే. అయితే ఒక్కోసారి ఈ రుణ దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరిస్తుంటాయి. అప్పుడు మనముందున్న మార్గాలు ఏమిటో తెలుసుకుందాం..

ఇవాళ అందరి జీవితాలు ముఖ్యంగా మధ్యతరగతి బతుకులు అప్పులతోనే తెల్లారిపోతున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు చాలా మంది వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఒక్కోసారి బ్యాంకులు ఈ అప్లికేషన్లను తిరస్కరిస్తుంటాయి. అందుకు ఈ కింది విషయాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


సిబిల్‌ స్కోరు

ఏ రుణం కావాలన్నా బ్యాంకులు ఆయా వ్యక్తుల సిబిల్‌ స్కోరు చూస్తాయి. ఈ స్కోరు కనీసం 750 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం మంచిది. అంతకంటే తక్కువగా ఉంటే రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఆలోచిస్తాయి.

అధిక అప్పులు

మీ ఆదాయంలో ఎక్కువ భాగం ఇప్పటికే ఉన్న అప్పుల చెల్లింపులకు పోతుంటే.. బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు ముఖం చాటేస్తాయి.

నిలకడలేని ఆదాయం, ఉద్యోగాలు

ఉద్యోగాల్లో కుదురుగా ఉండి.. స్థిరమైన ఆదాయాలు ఉన్న వారికే వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఇష్టపడతాయి.

అనేక అప్లికేషన్లు

స్వల్పకాలంలో రుణాల కోసం మీరు అనేక అప్లికేషన్లు పెట్టినా సమస్యే. బ్యాంకులు అలాంటి వ్యక్తులను అప్పుల అప్పారావులుగా పరిగణించి రుణాలు ఇచ్చేందుకు పెద్దగా ఇష్టపడవు.


పూర్తి వివరాలు లేకపోవడం

రుణ దరఖాస్తుతో పాటు బ్యాంకు అడిగిన ఐడీ ప్రూఫ్‌, శాలరీ స్లిప్పులు లేదా బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇవ్వాలి. లేకపోతే బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ అప్లికేషన్‌ను పక్కన పెడుతుంది.

క్రెడిట్‌ స్కోరు పెంచుకోవడం

క్రెడిట్‌ స్కోరు బాగోక బ్యాంకు మీ వ్యక్తిగత రుణ దరఖాస్తును తిరస్కరిస్తే ఈ కింది చర్యల ద్వారా స్కోరు పెంచుకోవచ్చు.

  • ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు సమయానికి చెల్లించడం

  • మీకు ఉన్న పరపతిలో 30 శాతానికి మించి ఉపయోగించుకోకపోవడం

  • తరచుగా రుణాల కోసం దరఖాస్తు చేయకపోవడం

  • ఉన్న రుణాలు చెల్లించడం ద్వారా పరపతి స్కోరు పెంచుకోవడం

  • క్రెడిట్‌ స్కోరు రిపోర్టులో తప్పులు ఉంటే వెంటనే సరి చేయించుకోవడం.

పూచీకత్తు రుణం

పరపతి స్కోరు సరిగా లేనప్పుడు ఏదైనా ఆస్తిని పూచీగా చూపి వ్యక్తిగత రుణాలు తీసుకోవడం మంచిది. ఈ పూచీతో బ్యాంకులు రుణ దరఖాస్తును త్వరగా ఆమోదించడమే గాక తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి.


అర్హత పెంచుకోవడం

రుణ దరఖాస్తుకు ముందే సిబిల్‌ స్కోరును మెరుగు పరుచుకోవటం, స్థిరమైన ఆదాయం, పాత రుణాలు సమయానికి సరిగా చెల్లించిన చరిత్ర కలిగి ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఈ కింది అంశాలు కూడా రుణ దరఖాస్తు ఆమోదానికి ఉపకరిస్తాయి.

  • మీ అర్హతకు మించిన వ్యక్తిగత రుణానికి అప్లయ్‌ చేయకూడదు

  • రుణ దరఖాస్తు చేసే నాటికి కనీసం ఆరు నెలల నుంచి ఒకే ఉద్యోగంలో ఉండాలి. స్వయం ఉపాధి అయితే స్థిరమైన ఆదాయం ఉందని బ్యాంకుకు నిరూపించాలి

  • పై అంశాలను తూచా తప్పకుండా పాటిస్తే మీ వ్యక్తిగత రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించడంతో పాటు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

తిరిగి దరఖాస్తు చేయడం

పరపతి స్కోరు, ఆదాయం పెరిగే వరకు ఆగి.. మళ్లీ దరఖాస్తు చేయడం మరో మార్గం. దీనివల్ల బ్యాంకు మీ రుణ దరఖాస్తుని తాజాగా పరిశీలించి రుణం మంజూరు చేసే అవకాశాలు ఎక్కువ.


తిరస్కరణ తర్వాత ఏమి చేయాలి?

మీ రుణ అప్లికేషన్‌ను బ్యాంకు తిరస్కరించగానే గాభరాపడి పోవాల్సిన పని లేదు. ఈ కింది చర్యల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

  • సమస్యను అర్థం చేసుకోవడం

  • ఏ కారణం చేత మీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైందో బ్యాంకును అడిగి తెలుసుకోవాలి

  • ఇంకో రుణం కోసం దరఖాస్తు చేయడం

  • ఇంతకు ముందు దరఖాస్తు చేసిన దాని కంటే తక్కువ రుణం కోసం మరో దరఖాస్తు చేయడం

  • కో అప్లికెంట్‌ లేదా హామీదారుని చేర్చడం

  • మీకంటే మంచి పరపతి స్కోరు ఉన్న వ్యక్తిని సహ దరఖాస్తుదారునిగా లేదా హామీదారుగా చేర్చుకోవడం

  • ఎన్‌బీఎ్‌ఫసీలు, ఫిన్‌టెక్‌లను ఆశ్రయించడం

  • బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎ్‌ఫసీలు, ఫిన్‌టెక్‌ కంపెనీలు పరపతి స్కోరు తక్కువగా ఉన్నా వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. కాకపోతే ఇందుకు వడ్డీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

India Pakistan Relations: పహల్గామ్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

RCB vs CSK Rain Update: ఆర్సీబీ vs సీఎస్‌కే మ్యాచుకు వర్షం ఎఫెక్ట్..రద్దైతే ఏంటి పరిస్థితి..

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

RCB vs CSK: నేడు ఆర్బీబీ vs చెన్నై మ్యాచ్..ప్లే ఆఫ్ ఆశలు ముంచుతుందా..

Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్

Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

Read More Business News and Latest Telugu News

Updated Date - May 04 , 2025 | 02:30 AM