Share News

MSE Loans: ఎంఎస్ఈలకు ఆర్‌బీఐ ఊరట

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:51 AM

దేశంలోని సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల (ఎంఎ్‌సఈ)కు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) పెద్ద ఊరట ఇచ్చింది. ఈ సంస్థలు బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీల నుంచి చలన (ఫ్లోటింగ్‌) వడ్డీకి తీసుకునే రుణాల...

MSE Loans: ఎంఎస్ఈలకు ఆర్‌బీఐ ఊరట

ప్రీపేమెంట్‌ పెనాల్టీల రద్దు

ముంబై: దేశంలోని సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల (ఎంఎ్‌సఈ)కు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) పెద్ద ఊరట ఇచ్చింది. ఈ సంస్థలు బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీల నుంచి చలన (ఫ్లోటింగ్‌) వడ్డీకి తీసుకునే రుణాల ముందస్తు చెల్లింపులపై పెనాల్టీలను రద్దు చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. జనవరి 1 నుంచి ఎంఎ్‌సఈలు తీసుకునే కొత్త రుణాలు, పాత రుణాల రెన్యూవల్‌కు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి ఉన్న రుణాలను ముందుగా చెల్లించాలన్నా బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు తమ ముక్కు పిండి మరీ ఈ పెనాల్టీలు వసూలు చేస్తున్నాయని ఎంఎ్‌సఈల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది.

ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 04:51 AM