Share News

RBI Steps In to Stabilize Rupee: రూపాయికి ఆర్‌బీఐ రక్ష

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:44 AM

డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనంపై ఆర్‌బీఐ ఆందోళన చెందుతోంది. రూపాయిలో స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ భారీగా జరుగుతున్నట్టు భావిస్తున్న ఆర్‌బీఐ రేటులో స్థిరత్వం వచ్చే...

RBI Steps In to Stabilize Rupee: రూపాయికి ఆర్‌బీఐ రక్ష

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనంపై ఆర్‌బీఐ ఆందోళన చెందుతోంది. రూపాయిలో స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ భారీగా జరుగుతున్నట్టు భావిస్తున్న ఆర్‌బీఐ రేటులో స్థిరత్వం వచ్చే వరకు మద్దతు చర్యలు కొనసాగించాలనుకుంటోందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.88.80 స్థాయికి పడిపోయింది. దీంతో ఈ రేటు త్వరలోనే రూ.89 స్థాయికి పతనమయ్యే అవకాశం ఉందని ఫారెక్స్‌ మార్కెట్‌లో అంచనాలు మొదయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటును ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.88.80 స్థాయికి మించి పతనం కానిచ్చేది లేదన్నారు. ఇందు కోసం అవసరమైనపుడల్లా ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్లను విక్రయిస్తామన్నారు. దీంతో బుధవారం డాలర్‌తో రూపాయి మారకం రేటు 73 పైసలు బలపడి రూ.88.08 వద్ద ముగిసింది. గత నాలుగు నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఒకే రోజు ఈ స్థాయిలో పుంజుకోవడం ఇదే మొదటిసారి.

ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 04:44 AM