RBI Relief to Banks Risk Based Deposit: డిపాజిట్లపై బ్యాంకులకు ఆర్‌బీఐ ఊరట
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:01 AM
ఆర్థికంగా పటిష్టంగా ఉన్న బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) పెద్ద ఓదార్పు ప్రకటించింది. డిపాజిట్ల బీమా కోసం వసూలు చేసే ప్రీమియానికి సంబంధించి ప్రస్తుతం...
ఇక రిస్క్ ఆధారంగా ప్రీమియం
హైదరాబాద్: ఆర్థికంగా పటిష్టంగా ఉన్న బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) పెద్ద ఓదార్పు ప్రకటించింది. డిపాజిట్ల బీమా కోసం వసూలు చేసే ప్రీమియానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని సవరించి, రిస్క్ ఆధారిత ప్రీమియం విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌బీఐ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు ప్రతి రూ.100 డిపాజిట్‌కు బీమా కింద 12 పైసలు ‘ది డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసీజీసీ)కు ప్రీమియంగా చెల్లిస్తున్నాయి. ఇక ఈ ప్రీమియం అన్ని బ్యాంకులకు ఒకేలా ఉండదు. నష్ట భయం (రిస్క్) ఆధారంగా ఇక ఈ ప్రీమియం వసూలు చేస్తారు. దీంతో ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న బ్యాంకులు తక్కువ ప్రీమియంతో బయటపడనున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లపైనా చర్చించినట్టు సమాచారం.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్ సన్యాల్