Share News

BREAKING: వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం!

ABN , Publish Date - Oct 01 , 2025 | 10:18 AM

సామాన్యులకు మరోసారి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు యథాతథంగా ఉంచుతూ ప్రజలకు తీపి కబురు అందించింది. కాగా రెపో రేటు 5.5 శాతం యథాతథం ఉండనుంది.

BREAKING: వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం!

RBI Repo Rates: సామాన్యులకు మరోసారి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు జరిగిన సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు యథాతథంగా ఉంచుతూ ప్రజలకు తీపి కబురు అందించింది. కాగా రెపో రేటు 5.5 శాతం యథాతథంగా ఉండనుంది. అయితే ఆర్బీఐ రేపో రేటులను స్థిరంగా ఉంచండం ఇది రెండో సారి. అయితే.. తాజా ఆర్బీఐ ప్రకటనతో మనం కట్టే EMIలలో ఎలాంటి మార్పులు ఉండవు.


ఇటీవల తగ్గింపు...

దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది. అయితే ఇటీవల అతర్జాతీయంతో పాటు మన దేశంలో నెలకొన్న కొన్ని పరిస్థితుల కారణాలతో ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్‌ లో జరిగిన సమావేశంలో రేపో రేట్లను 0.25 శాతం చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. జూన్‌ నెలలో నిర్వహించిన సమావేశంలో ఆర్బీఐ ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. కాగా ఇలా వరుసగా మూడు కీలక సమావేశాల్లో ఆర్బీఐ.. రేపో రేటును 1 శాతం మేర తగ్గించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్ పై విధించిన పన్నుల భారం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు నెలలో రేపో రేటు మాత్రం యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే అక్టోబర్ నెలలో కూడా రేపో రేటును యథాతథంగా ఉంచుతూ ప్రకటన విడుదల చేసింది.


ఇవి కూడా చదవండి...

కాస్త నిలకడగా కృష్ణానది.. అయినప్పటికీ

ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం

Updated Date - Oct 01 , 2025 | 11:05 AM