RBI Issues New Guidelines: మరణించిన వ్యక్తుల ఖాతాల సత్వర సెటిల్‌మెంట్
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:49 AM
మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను వారి నామినీలకు అప్పగించే సెటిల్‌మెంట్ ప్రక్రియను భారతీయ రిజర్వ్ బ్యాంక్...
బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్‌బీఐ
ముంబై: మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను వారి నామినీలకు అప్పగించే సెటిల్‌మెంట్ ప్రక్రియను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సులభతరం చేసింది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా వీలైనంత త్వరగా ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని కోరింది.
చనిపోయిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలోని మొత్తాన్ని నామినీకి, జాయింట్ ఖాతా అయితే సర్వైవర్‌కు చెల్లించాలి
ఒకవేళ ఖాతాదారు ఎవరినీ నామినీగా పేర్కొనక పోయినా, డిపాజిట్ మొత్తం నిర్ణీత మొత్తానికి లోబడి ఉంటే, బ్యాంకులు ఆ మొత్తాన్ని సులభతర పద్దతిలో సెటిల్ చేయాలి
సహకార బ్యాంకులైతే రూ.5 లక్షల లోపు, ఇతర బ్యాంకులైతే రూ.15 లక్షలను గరిష్ఠ పరిమితిగా పెట్టుకోవాలి.
బ్యాంకుల బోర్డులు అనుమతిస్తే ఇంతకు మించిన మొత్తాన్ని కూడా అనుమతించవచ్చు
అయితే ఇందుకు వారసత్వం సర్టిఫికెట్లు లేదా చట్టబద్ద వారసుడనే సర్టిఫికెట్లు తీసుకోవాలి
చనిపోయిన ఖాతాదారుల నామినీలు, వారసుల నుంచి క్లెయిమ్ అందిన 15 రోజుల్లోగా సెటిల్‌మెంట్ పూర్తి చేయాలి
15 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్ చేయలేకపోతే అందుకు కారణాలు ఏమిటో నామినీ, చట్టబద్ద వారసులకు తెలియజేయాలి
సహేతుక కారణం లేకుండా ఆలస్యం చేస్తే, ఖాతాలోని మిగులుపై బ్యాంక్ అమలు చేస్తున్న వడ్డీకి తోడు 4ు వార్షిక వడ్డీ చెల్లించాలి.
లాకర్‌లోని వస్తువుల అప్పగింతలో ఆలస్యమైతే రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News