రామ్‌రాజ్ ఆచార్య పంచకచం ధోవతులు
ABN , Publish Date - May 29 , 2025 | 02:26 AM
రామ్‌రాజ్ సంస్థ ఆధ్యాత్మిక ఆచారాలు, మతపరమైన వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ధరించడానికి అనువుగా ‘ఆచార్య పంచకచం’ ధోవతులను మార్కెట్లోకి తెచ్చింది...
ప్రచారకర్తగా దుష్యంత్ శ్రీధర్
చెన్నై (ఆంధ్రజ్యోతి): రామ్‌రాజ్ సంస్థ ఆధ్యాత్మిక ఆచారాలు, మతపరమైన వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ధరించడానికి అనువుగా ‘ఆచార్య పంచకచం’ ధోవతులను మార్కెట్లోకి తెచ్చింది. ప్రముఖ పండితుడు దుష్యంత్ శ్రీధర్‌ను దీనికి ప్రచారకర్తగా నియమించింది. తమ సంస్థ ఆచార్యులు, గురువుల కోసం పంచకచం పంచెలను ప్రత్యేకంగా తయారుచేసిందంటూ ఇవి కేవలం సాంప్రదాయక దుస్తులు కాదని, పవిత్రమైన పండుగ సందర్భాల్లో ధరించే భారతీయ ప్రాచీన వారసత్వానికి చిహ్నమని సంస్థ వ్యవస్థాపకులు కేఆర్ నాగరాజన్ చెప్పారు. భారతీయ సంస్కృతికి ఎంతో గౌరవనీయులైన ఆదిశంకరులు, రామానుజులు, వేదాంత దేశికులు, మధ్వాచార్యులు, కంచిపరమాచార్యుల పరంపరను గౌరవిస్తూ రామ్‌రాజ్ కంపెనీ ఈ ధోవతులను పరిచయం చేయడం సముచితంగా ఉందని దుష్యంత్ శ్రీధర్ ఈ సందర్భంగా అన్నారు.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి