Share News

Ramky Infrastructure: ఐదేళ్లలో రూ. 9,000 కోట్ల రెవెన్యూ టార్గెట్‌

ABN , Publish Date - Dec 24 , 2025 | 02:59 AM

రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌.. వచ్చే ఐదేళ్లలో రూ.9,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం నాడిక్కడ సంస్థ సీఈఓ సునీల్‌ నాయర్‌ మాట్లాడుతూ...

Ramky Infrastructure: ఐదేళ్లలో రూ. 9,000 కోట్ల రెవెన్యూ టార్గెట్‌

  • రామ్‌కీ ఇన్‌ఫ్రా సీఈఓ సునీల్‌ నాయర్‌

  • రూ.10,000 కోట్లకు ఆర్డర్‌ బుక్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌.. వచ్చే ఐదేళ్లలో రూ.9,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం నాడిక్కడ సంస్థ సీఈఓ సునీల్‌ నాయర్‌ మాట్లాడుతూ..గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో సంస్థ ఆదాయం రూ.2,044 కోట్లుగా ఉందని, రానున్న ఐదు సంవత్సరాల్లో దీన్ని ఏటా 30 శాతం వృద్ధితో రూ.9,000 కోట్ల (100 కోట్ల డాలర్లు)కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈపీసీ, హ్యామ్‌, బీఓటీ విభాగాల్లో పెద్దఎత్తున ఆర్డర్లను దక్కించుకోవటం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశీయంగా ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి పెడుతుండటం కూడా తమకు కలిసి రానుందన్నారు. ప్రస్తుతం సంస్థ ఆర్డర్‌ బుక్‌ రూ.10,000 కోట్లుగా ఉందని, ఈ ఏడాది దేశీయంగా మరో 9,000 కోట్ల ఆర్డర్లతో పాటు విదేశాల్లో రూ.1,000 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు నాయర్‌ వెల్లడించారు. ప్రధానంగా ఇండస్ట్రియల్‌ పార్కులు, వాటర్‌, వేస్ట్‌ వాటర్‌, వేస్ట్‌ టు ఎనర్జీ విభాగాలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి హ్యామ్‌ విధానంలో రూ.2,085 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు ఆయన చెప్పారు. ఆర్డర్‌లో భాగంగా హైదరాబాద్‌కు మల్లన్నసాగర్‌ నుంచి తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని నాయర్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా దుల్కర్‌ సల్మాన్‌

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 24 , 2025 | 02:59 AM