ఇండిగోలో గంగ్వాల్ రూ 11564 కోట్ల వాటా విక్రయం
ABN , Publish Date - May 28 , 2025 | 05:29 AM
ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వాల్, ఆయన కుటుంబ ట్రస్ట్ కలిసి సంస్థలో 5.7 శాతం వాటాను రూ.11,564 కోట్లకు...
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వాల్, ఆయన కుటుంబ ట్రస్ట్ కలిసి సంస్థలో 5.7 శాతం వాటాను రూ.11,564 కోట్లకు విక్రయించారు. 5.7 శాతం వాటాకు సమానమైన 2.21 కోట్ల షేర్లను రూ.5,230.50 చొప్పున విక్రయించినట్లు తెలిసింది. ఈ లావాదేవీకి ముందు కంపెనీలో గంగ్వాల్, ఆయన కుటుంబ ట్రస్ట్‌కు 13.5 శాతం వాటా ఉండేది. ఇండిగో మరో ప్రమోటర్ రాహుల్ భాటియాతో విబేధాల నేపథ్యంలో గంగ్వాల్ తన వాటాను క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి