Raghuvamshi Aerospace: రూ 100 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ప్లాంట్
ABN , Publish Date - Dec 16 , 2025 | 06:32 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్.. హార్డ్‌వేర్ పార్క్‌లో డీప్‌టెక్ డిజైన్, ఉత్ప త్తి, ఇంటిగ్రేషన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అలాగే దేశీయంగా అభివృద్ధి..
6 యూఏవీలు, రక్షణ ఉత్పత్తుల ఆవిష్కరణ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్.. హార్డ్‌వేర్ పార్క్‌లో డీప్‌టెక్ డిజైన్, ఉత్ప త్తి, ఇంటిగ్రేషన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అలాగే దేశీయంగా అభివృద్ధి చేసిన ఆరు మానవ రహిత విమానాలు (యూఏవీ), అటానమస్ రక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. రఘవంశీ గ్రూప్‌నకు చెందిన ఏరోబోట్.. హైదరాబాద్‌లోని హార్డ్‌వేర్ పార్క్‌లో రూ.100 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎండీ వంశీ వికాస్ వెల్లడించారు. ఈ ప్లాంట్‌లో కామికేజ్ యూఏవీలు, యూజీవీలు, మైక్రో టర్బో జెట్ ఇంజ న్లు సహా నిఘా డ్రోన్లు, ఎయిర్ బేస్డ్ మిస్పైల్ లాంచర్స్, డీప్ స్ట్రైక్, రోబోటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సొల్యూషన్స్ డిజైన్, అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఉత్పత్తులన్నీ 600 కిలోమీటర్ల వేగంతో 300 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణిస్తాయని తెలిపారు.
కాగా ఈ ఉత్పత్తుల కోసం భారతీయ సైన్యం, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), ఏఆర్‌సీఐ సహా ఐఐఐటీ హైదరాబాద్‌తో రఘవంశీ గ్రూప్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం రఘువంశీ అమెరికా, యూకే, భారత్‌ల్లో మొత్తం 10 మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్వహిస్తోందని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ రూ.1,500 కోట్లుగా ఉండగా టర్నోవర్ రూ.500 కోట్లకు పైగా ఉందని వంశీ వివరించారు. కాగా హర్డ్‌వేర్ పార్క్‌లో రూ.300 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న రక్షణ ఉత్పత్తుల తయారీ ప్లాంట్ వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికల్లా అందుబాటులోకి రానుందని వంశీ వెల్లడించారు.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..