Share News

Stock Market Outlook: పుల్‌బ్యాక్‌కు అవకాశం

ABN , Publish Date - Nov 10 , 2025 | 05:40 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఈ వారం పుల్‌బ్యాక్‌ సూచనలు కనిపిస్తున్నాయి. గత వారం లాభాలు స్వీకరించిన ఇన్వెస్టర్లు ఈ వారం కొనుగోళ్లకు దిగే ఆస్కారం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ...

Stock Market Outlook: పుల్‌బ్యాక్‌కు అవకాశం

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఈ వారం పుల్‌బ్యాక్‌ సూచనలు కనిపిస్తున్నాయి. గత వారం లాభాలు స్వీకరించిన ఇన్వెస్టర్లు ఈ వారం కొనుగోళ్లకు దిగే ఆస్కారం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తే పెరగటం ఖాయం. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ, చమురు, మెటల్‌, ఇన్‌ఫ్రా రంగ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. కంపెనీల ఫలితాలను బట్టి మదుపరులు షేర్లను ఎంపిక చేసుకోవటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరుకు రూ.600 శ్రేణిలో మద్దతు లభించింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ క్రమంగా పెరుగుతున్నాయి. గత శుక్రవారం రూ.615 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.610లో పొజిషన్‌ తీసుకుని రూ.655/675 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.595 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

వోల్టాస్‌: ఏడాది కాలంగా పతనమవుతూ వస్తున్న ఈ కౌంటర్‌ ప్రస్తుతం ట్రెండ్‌ రివర్సల్‌ బాటలో ఉంది. కీలకమైన రూ.1,350 స్థాయిలో కదలాడుతోంది. గత శుక్రవారం రూ.1,321 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,300 ఎగువన ప్రవేశించి రూ.1,450/1,500 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.1,275.

టాటా స్టీల్‌: ఈ ఏడాది ఆరంభం నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం రెండేళ్ల నాటి గరిష్ఠ స్థాయిని బ్రేక్‌ చేసింది. స్వల్పంగా హెడ్‌లైన్‌ సప్లయ్‌ రావటంతో పుల్‌బ్యాక్‌ అయ్యింది. మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తుందన్న అంచనాలు, మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ నేపథ్యంలో ఈ కౌంటర్‌పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత శుక్రవారం రూ.181 వద్ద ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.180 స్థాయిలో ప్రవేశించి రూ.220 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.175.

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌: ఈ ఏడాది మార్చి నుంచి ఈ కౌంటర్‌ దాదాపుగా 130 శాతానికి పైగా పెరిగింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, మూమెంటమ్‌ చాలా బాగుంది. గత శుక్రవారం రూ.338 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.330 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.390/410 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.312.


బజాజ్‌ ఫైనాన్స్‌: రెండేళ్ల బేస్‌ బ్రేకౌట్‌ తర్వాత ఈ షేరు సుదీర్ఘ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఫలితాల నేపథ్యంలో మూమెంటమ్‌ పెరిగింది. గత శుక్రవారం రూ.1,066 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,050 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,250/1,350 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌ రూ1,010.

- మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 10 , 2025 | 05:40 AM