Post Office: రోజుకు రూ. 200 మీది కాదనుకుంటే.. లక్షన్నర మీ సొంతం.. ఎలాగంటే..
ABN , Publish Date - Nov 06 , 2025 | 07:39 PM
పోస్టాఫీస్‌లో సూపర్ పథకం అందుబాటులోకి వచ్చింది. దీంతో రోజు కొంత నగదు డిపాజిట్ చేస్తే.. లక్షాధికారి అయిపోతారు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు భవిష్యత్తు అవసరాల కోసం నగదు పొదుపు చేస్తున్నారు. నగదు పొదుపు చేసేందుకు బ్యాంకుల్లో అనేక పథకాలు ఉన్నా.. చాలా మంది పోస్టాఫీస్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో నగదు పెడితే ఎక్కడికి పోదనే ఒక నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. నగదు పొదుపు కోసం పోస్టాఫీస్‌ల్లో చాలా పథకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆర్డీ.. అంటే రికరింగ్ డిపాజిట్ పథకం.
కేవలం రోజుకు రూ. 200 కడితే.. నెలకు రూ. 6 వేలు అవుతుంది. అలా రెండేళ్లు కట్టాలి. మొత్తం రూ.1,44000 అవుతుంది. దీనికి 6.7 శాతం వడ్డి అదిస్తుంది. అంటే రూ.10,112 వస్తుంది. అంటే రెండేళ్ల తర్వాత మొత్తం రూ. 1,54112 వస్తుంది. ఒక వేళ.. మీకు అత్యవసరంగా నగదు అవసరమైతే.. మీ మొత్తం డిపాజిట్‌లో 50 శాతం వరకు రుణం పొందవచ్చు.
ఇక పోస్టాఫీస్‌లో ఆర్డీ కట్టేందుకు ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు కాల పరిమితి ఉంటుంది. మనం ఎన్నేళ్లకు నగదు కడితే అందుకు తగ్గట్టుగా వడ్డీ వస్తుంది. ఉదాహరణకు.. ఐదేళ్లకు ఆర్డీ కడితే..60 నెలల తర్వాత తీసుకోవచ్చు. అలా కాకుండా దానిని మరో ఐదేళ్ల వరకు పెంచుకునే వెలుసుబాటు ఉంది. దీంతో అధిక వడ్డీ వస్తుంది. అలా లక్షాధికారిగా సులువుగా కావచ్చు.
అయితే 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు.. ఈ ఆర్డీ ఒపెన్ చేసేందుకు అర్హులు. ఏ పోస్టాఫీస్‌లో అయినా ఈ ఖాతా తెరవవచ్చు. ఒక వేళ పిల్లలు మైనర్లు అయితే.. పిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు ఖాతా తెరవవచ్చు. ఇది నమ్మకమైన పొదుపునకు సులువైన మార్గం.