Coal India Limited: అనుబంధ సంస్థలను లిస్టింగ్ చేయండి
ABN , Publish Date - Dec 29 , 2025 | 05:12 AM
పాలనా విధానాలు, బాధ్యతాయుత ధోర ణి రెండింటినీ మెరుగుపరిచే విధానంలో భాగంగా ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అనుబంధ సంస్థలన్నింటినీ...
కోల్ ఇండియాకు పీఎంఓ ఆదేశాలు
న్యూఢిల్లీ: పాలనా విధానాలు, బాధ్యతాయుత ధోర ణి రెండింటినీ మెరుగుపరిచే విధానంలో భాగంగా ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అనుబంధ సంస్థలన్నింటినీ 2030 నాటికి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ).. బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ సంస్థ అధీనంలో 8 అనుబంధ కంపెనీలున్నాయి. అవి ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, భారత్ కోకింగ్ కోల్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, నార్దర్న్ కోల్‌ఫీల్డ్స్, మహానది కోల్‌ఫీల్డ్స్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంపీడీఐ). వీటిలో బీసీసీఎల్, సీఎంపీడీఐ 2026 మార్చి నాటికి లిస్టింగ్ కానున్నాయని, అందుకు సన్నాహాలు పూర్తయ్యాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను పోటు ఎంత