Share News

ఫోన్‌పే రూ13000 కోట్ల ఐపీఓ

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:01 AM

దేశంలో అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పే సైతం పబ్లిక్‌ ఆఫరింగ్‌కు రాబోతోంది. ఇందుకోసం కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌...

ఫోన్‌పే రూ13000 కోట్ల ఐపీఓ

మర్చంట్‌ బ్యాంకర్ల నియామకం, ఆగస్టులో సెబీ దరఖాస్తు

దేశంలో అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పే సైతం పబ్లిక్‌ ఆఫరింగ్‌కు రాబోతోంది. ఇందుకోసం కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, జేపీ మోర్గాన్‌ చేజ్‌, సిటీ గ్రూప్‌, మోర్గాన్‌ స్టాన్లీని మర్చంట్‌ బ్యాంకర్లుగా నియమించుకున్నట్లు తెలిసింది. ఫోన్‌పే ఈ ఆగస్టు కల్లా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఐపీఓ పత్రాలను సమర్పించవచ్చని, పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 150 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో రూ.13,000 కోట్ల పైమాటే) వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తద్వారా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.30 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ గ్రూప్‌నకు చెందిన ఫోన్‌పే 2015లో ప్రారంభమైంది.

  • పంటల పరిరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ ఇండోగల్ఫ్‌ క్రాప్‌సైన్సెస్‌ రూ.200 కోట్ల ఐపీఓ ఈనెల 26న మొదలై 30న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.105-111గా నిర్ణయించింది.

ఇవీ చదవండి:

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 04:01 AM