Share News

Pharma Industry Warns: అమెరికాలో ధరలు పెంచేస్తాం

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:49 AM

ఫార్మా కంపెనీల ప్రతిస్పందన న్యూఢిల్లీ: ట్రంప్‌ యంత్రాంగం ఔషధ దిగుమతులపై 200 శాతం సుంకాలు విధించినట్టయితే అమెరికన్‌ మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదని...

Pharma Industry Warns: అమెరికాలో ధరలు పెంచేస్తాం

న్యూఢిల్లీ: ట్రంప్‌ యంత్రాంగం ఔషధ దిగుమతులపై 200 శాతం సుంకాలు విధించినట్టయితే అమెరికన్‌ మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదని ఫార్మా పరిశ్రమ హెచ్చరించింది. అయితే ప్రస్తుతానికి అది హెచ్చరిక మాత్రమేనని, టారిఫ్ ల పెంపు ఆ స్థాయిలో ఉండకపోవచ్చునని పేర్కొంటూ అలాంటి నిర్ణయం గనుక తీసుకున్నట్టయితే తాము ధరలు పెంచుతామని, అది అమెరికన్‌ వినియోగదారులకు భారం కాక తప్పదని పరిశ్రమ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరన్నారు. సుంకాలు పెంచితే అమెరికాలో హెల్త్‌కేర్‌ సంబంధిత ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుందంటున్నారు.

మార్జిన్ల ఒత్తిడి తప్పదు: చిన్న ఫార్మా కంపెనీలు అతి తక్కువ మార్జిన్‌తో అమెరికాకు ఔషధాలు సరఫరా చేస్తున్నాయని, వాటిపై మార్జిన్ల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఔషధాలపై భారత్‌ 10 శాతం సుంకాలు వసూలు చేస్తుండగా అమెరికా ఎలాంటి సుంకాలు విధించడంలేదు. భారత ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక మార్కెట్‌ అని, వాటి మొత్తం ఆదాయంలో 30-40 శాతం అమెరికన్‌ మార్కెట్‌ నుంచే వస్తుందని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌, ఫార్మా హెడ్‌ దీపక్‌ జోత్వానీ అన్నారు. భారత ఫార్మా కంపెనీలు ప్రధానంగా జెనరిక్‌ ఔషధాలు అమెరికన్‌ మార్కెట్‌కు సరఫరా చేస్తాయని, ఆ విభాగంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. అధిక టారి్‌ఫల వల్ల ఫార్మా రంగంలో ఎగుమతుల వృద్ధి, లాభదాయకత రెండూ ప్రభావితం అవుతాయన్నారు. భారత కంపెనీలు సరఫరా చేసిన ఔషధాల వల్ల 2022 సంవత్సరంలో అమెరికన్‌ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు 21,900 కోట్ల డాలర్లు (రూ.18.83 లక్షల కోట్లు) ఆదా అయినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.


మాపై పెద్ద ప్రభావం ఉండదు

అమెరికా ప్రతిపాదించిన మేరకు రాగిపై 50 శాతం సుంకాలు విధించినా ఆ ప్రభావం తమపై పెద్దగా ఉండదని ఇంటర్నేషనల్‌ కాపర్‌ ఆసోసియేషన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మయూర్‌ కర్మార్కర్‌ అన్నారు. భారత్‌ రాగి కొరత దేశమని, అందువల్ల అమెరికాకు తమ ఎగుమతులు కేవలం 10 వేల టన్నులేనని ఆయన చెప్పారు. భారత్‌ పునరుత్పాదక ఇంధనం, ఈవీలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నందు వల్ల దేశీయంగానే డిమాండు అధికంగా ఉన్నదన్న విషయం ఆయన గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 08:06 AM