Share News

అరుంధతీ భట్టాచార్య, పవన్‌ గోయెంకాకు పద్మశ్రీ

ABN , Publish Date - Jan 26 , 2025 | 02:26 AM

ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వాణిజ్య, పారిశ్రామిక రంగం నుంచి మొత్తం 10 మందికి ఈ పురస్కారాలు వరించాయి. జపాన్‌ వాహన సంస్థ...

అరుంధతీ భట్టాచార్య, పవన్‌ గోయెంకాకు పద్మశ్రీ

వాణిజ్య, పారిశ్రామిక రంగం నుంచి 10 మందికి పద్మ పురస్కారాలు

న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వాణిజ్య, పారిశ్రామిక రంగం నుంచి మొత్తం 10 మందికి ఈ పురస్కారాలు వరించాయి. జపాన్‌ వాహన సంస్థ సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దివంగత ఒసాము సుజుకీకి పద్మ విభూషణ్‌ దక్కగా.. తమిళనాడుకు చెందిన నల్లి సిల్క్స్‌ వ్యవస్థాపకులు నల్లి కుప్పుస్వామి చెట్టి, గుజరాత్‌కు చెందిన జైడస్‌ లైఫ్‌ సైన్సెస్‌ చైర్మన్‌ పంకజ్‌ పటేల్‌కు పద్మ భూషణ్‌ లభించింది. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్‌, సేల్స్‌ఫోర్స్‌ ఇండియా ప్రస్తుత చైర్‌పర్సన్‌, సీఈఓ అరుంధతీ భట్టాచార్యకు పద్మశ్రీ దక్కింది. దేశీయ వాహన సంస్థ


మహీంద్రా అండ్‌ మహీంద్రా మాజీ ఎండీ, భారత స్పేస్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌స్పే్‌స ప్రస్తుత చైర్మన్‌ పవన్‌ గోయెంకా, ఎవాన్‌ సైకిల్స్‌ ఎండీ ఓంకార్‌ సింగ్‌ పాహ్వా, యాక్సెల్‌ పార్ట్‌నర్‌ వ్యవస్థాపక భాగస్వామి ప్రశాంత్‌ ప్రకాశ్‌, హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ చైర్మన్‌ ఆర్‌జీ చంద్రమోగన్‌, సెంచురీ ప్లైబోర్డ్స్‌ సజ్జన్‌ భజంకకు సైతం పద్మశ్రీ లభించింది.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 02:26 AM