Share News

OPEC and Russia: పెరగనున్న ముడి చమురు ఉత్పత్తి

ABN , Publish Date - Oct 06 , 2025 | 04:57 AM

నవంబరు నుంచి ముడి చమురు రోజువారీ ఉత్పత్తిని 1.37 లక్షల బ్యారెళ్ల మేర పెంచాలని ఒపెక్‌ దేశాల కూటమి, రష్యా నిర్ణయించాయి. తాము కోల్పోయిన వాటా పెంచుకునేందుకు...

OPEC and Russia: పెరగనున్న ముడి చమురు ఉత్పత్తి

వియన్నా (ఆస్ట్రియా): నవంబరు నుంచి ముడి చమురు రోజువారీ ఉత్పత్తిని 1.37 లక్షల బ్యారెళ్ల మేర పెంచాలని ఒపెక్‌ దేశాల కూటమి, రష్యా నిర్ణయించాయి. తాము కోల్పోయిన వాటా పెంచుకునేందుకు రోజువారీ ఉత్పత్తిని 2.74 లక్షల నుంచి 5.48 లక్షల బ్యారెళ్ల మేర పెంచాలని సౌది అరేబియా పట్టుపట్టింది. అయితే మెజారిటీ దేశాలు 1.37 లక్షల బ్యారెళ్ల పెంపునకు అమోదం తెలిపాయి. దీంతో ఈ సంవత్సరం మార్చి నుంచి ఈ దేశాలు అమలు చేస్తున్న ఉత్పత్తి కోతకు తెరపడింది. తాజా నిర్ణయంతో ప్రస్తుతం 65 డాలర్ల వద్ద ట్రేడవుతున్న బ్రెంట్‌ రకం చమురు బ్యారెల్‌ ధర మరింత దిగి వస్తుందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2025 | 04:57 AM