Share News

ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌ లాభం రూ 20 69 కోట్లు

ABN , Publish Date - May 27 , 2025 | 02:53 AM

విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్‌) 2023-24 ఆర్థిక సంవత్స రం నాలుగో త్రైమాసికంలో రూ.448.92 కోట్ల ఆదాయంపై...

ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌ లాభం రూ 20 69 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్‌) 2023-24 ఆర్థిక సంవత్స రం నాలుగో త్రైమాసికంలో రూ.448.92 కోట్ల ఆదాయంపై రూ.20.69 కోట్ల నికరలాభం ఆర్జించింది. ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 55ు, లాభం 39ు పెరిగాయి. ఈ త్రైమాసికంలో తాము 219 వాహనాలను డెలివరీ చేశామని, గత ఏడాది అందించిన 131 వాహనాలతో పోల్చితే ఇది 67ు అధికమని కంపెనీ తెలిపింది. ఇప్పటికి మొత్తం 2,718 బస్సులను అందించినట్లు పేర్కొంది. ప్రస్తుతం తమ చేతిలో 10,022 బస్సుల సరఫరా ఆర్డర్లున్నట్టు తెలియచేసింది. మార్చి 31తో ముగిసిన ఏడాది కాలానికి ఒక్కో షేరుపై రాబడి (ఈపీఎస్‌) రూ.9.36 నుంచి రూ.16.92కి పెరిగినట్టు కంపెనీ సీఎండీ కేవీ ప్రదీప్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ రూ.1801.9 కోట్ల ఆదాయంపై రూ.139.21 కోట్ల నికరలాభం ఆర్జించింది.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:53 AM