Share News

Ola Electric IPO: నిండా మునిగిన ఓలా ఎలక్ట్రిక్‌ ఇన్వెస్టర్లు

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:06 AM

ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ షేర్లు మదుపరులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో ఐపీఓ ద్వారా ఒక్కోటి రూ.76 చొప్పున జారీ చేసిన ఈ కంపెనీ...

Ola Electric IPO: నిండా మునిగిన ఓలా ఎలక్ట్రిక్‌ ఇన్వెస్టర్లు

16 నెలల్లో రూ.55,000 కోట్లు హాంఫట్‌

ముంబై: ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ షేర్లు మదుపరులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో ఐపీఓ ద్వారా ఒక్కోటి రూ.76 చొప్పున జారీ చేసిన ఈ కంపెనీ షేర్లు గురువారం బీఎ్‌సఈలో 4.98 శాతం నష్టంతో రూ.31.28 వద్ద ముగిశాయి. గత ఏడాది ఆగస్టులో నమోదైన రూ.157తో పోలిస్తే ఇది 80 శాతం తక్కువ. దీంతో ఈ కంపెనీ షేర్ల మార్కెట్‌ క్యాప్‌ గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఇప్పటి వరకు రూ.55,520 కోట్లు హరించుకుపోయింది. మరోవైపు తన అప్పులు చెల్లించేందుకు కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ భవిష్‌ అగర్వాల్‌ గత రెండు రోజుల్లో 6.8 కోట్ల షేర్లను అమ్మడంతో ఈ కౌంటర్‌లో బుధ, గురువారాల్లో అమ్మకాలు మరింత పోటెత్తాయి.

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 19 , 2025 | 03:06 AM