Share News

Odisha CM Mohan Charan Majhi Invites: ఒడిశాలో పెట్టుబడులు పెట్టండి

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:14 AM

ఒడిశాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ పారిశ్రామికవేత్తలను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో...

Odisha CM Mohan Charan Majhi Invites: ఒడిశాలో పెట్టుబడులు పెట్టండి

  • ముఖ్యమంత్రి సీఎం మోహన్‌ చరణ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఒడిశాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ పారిశ్రామికవేత్తలను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఒడిశా ఇన్వెస్టర్స్‌ మీట్‌’ కార్యక్రమంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఒడిశాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను స్థానిక పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సమావేశం సందర్భంగా ఒడిశా ప్రభుత్వం రూ.27,650 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 13 కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులతో 15,905 మంది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని సీఎం చెప్పారు. మరో 40,000 ఉద్యోగాల కల్పనకు దోహదం చేసే రూ.39,131 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా స్థానిక పారిశ్రామికవేత్తల నుంచి ఆసక్తి వ్యక్తమైందని ఆయన ప్రకటించారు.

ఇవీ చదవండి:

ఎంఎస్ఎంఈలకు ఏఐ దన్ను

రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్‌ సన్యాల్‌

Updated Date - Dec 20 , 2025 | 04:14 AM